తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది.. తాజా పరిణామాలపై శుక్రవారం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నో ఏళ్లుగా…
Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. …
Shabbir Ali comments on Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కోమటిరెడ్డి వ్యవహారంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నాయకులు ఒకరికి ఒకరు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు.
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.
తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో గోదావరి పోటెత్తిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో వరదలతో అతలాకుతలం అవుతున్నారు.. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు.. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు నస్తపోయాయని లేఖలో పేర్కొన్న ఆయన.. వరద ప్రాంతాల్లో…
అసలే వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. ఛాన్స్ దొరకగానే పరస్పరం మాటలతో విరుచుకు పడుతున్నారు. పార్టీ ఇంఛార్జ్ ఎదుటే అలా జరగడంతో అంతా బిత్తర పోయారట. నాకెందుకు చెప్పలేదని ఒకరు.. నీకెందుకు చెప్పాలని ఇంకొకరు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారట. ఈ తాజా గొడవపైనే కాంగ్రెస్‌లో చర్చ. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఇద్దరూ కీలక నాయకులే.…
తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి. ఈ పేరుకంటే జగ్గారెడ్డిగానే అందరికీ పరిచయం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కొద్దిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే కయ్ మంటున్నారు. ఇటీవల పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా.. గోడకేసి కొడతానని రేవంత్ అనడంతో.. అంతే స్థాయిలో భగ్గుమన్నారు జగ్గారెడ్డి. గోడకేసి కొట్టడానికి నువ్వెవడివి అని నేరుగానే రేవంత్‌కు గురిపెట్టారు. ఆ వివాదం కాంగ్రెస్ పొలిటికల్ టెంపరేచర్‌ను అమాంతం పెంచేసింది. చివరకు వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి…
తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు.
చెప్పకుండా రేవంత్ రావడంపై నల్లగొండ జిల్లా నేతల అభ్యంతరం?కాంగ్రెస్ అంటేనే నేతల మధ్య కయ్యలా మారి పార్టీగా మారిపోయింది. అది జిల్లాస్థాయి సమావేశమైనా.. తాజాగా రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశమైనా పంచాయితీ కామన్. మీడియా ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్సే అందుకు అద్దం పడుతున్నాయి. సీఎల్పీలో మీడియా సమావేశం కంటే ముందే.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ ఇంట్లో భేటీలు జరిగాయి. కొందరు ముఖ్య…