ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో…