Pawan Kalyan: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ తదుపరి సినిమానే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. సాహో సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. సినిమా పరాజయాన్ని అందుకున్నా సుజీత్ కు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది.