Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఓ మాట ఇచ్చారు పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట ప్రకారం.. శారదా హైస్కూల్ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు అందించారు. ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.