జనసేన అధినేతగా ఇకపై సినిమాలలో నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్… అభిమానుల కోసం, ఆర్థిక వెసులబాటు కోసం యూటర్న్ తీసుకున్నారు. రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను అధికారికంగా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించిన పవన్ ఒకసారి… అది రివీల్ అయిన తర్వాత ఇక మొహమాటపడకుండా వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టేశారు. అయితే… ఈ రీ-ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు, వాటి కథా కమామీషులను గమనిస్తే… ఇవన్నీ పవన్ పొలిటికల్ రూట్ మ్యాప్ కు అనుగుణంగా తెరకెక్కుతున్నాయేమో అనిపిస్తోంది.…