Hyderabad Rains : నగర వ్యాప్తంగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో నిమ…