ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్‌జీ పేర్కొన్నారు.