2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ పూర్తి స్థాయిలో సినిమా చెయ్యలేదు. ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేశాడు కానీ షారుఖ్ సోలో సినిమా మాత్రం చెయ్యలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ కూడా కష్టాల్లోకి వెళ్లిపోవడంతో, షారుఖ్ లాంటి స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చే వరకూ బాలీవుడ్ కష్టాలు తీరవు అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. ఎట్టకేలకు దాదాపు అయిదేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు.…