దేశంలోని పలు మెట్రో నగరాల్లో ప్రయాణికుల పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో మెట్రో రైళ్లలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చెన్నైలోని బ్లూ లైన్‌లో ఒక మెట్రో రైలు అకస్మాత్తుగా సబ్‌వే క్రింద ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. రైలు దాదాపు 10…