సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి…
సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో.. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు చర్చించారు. రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.