ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు.