Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది.…
దేశ చరిత్రలో ఆగస్టు 14 వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్ గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో…