లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ తన కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది.