Parliament Attack : దేశ పార్లమెంటులో బుధవారం భద్రతా లోపం బట్టబయలైంది. ఇది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నలుగురు కలిసి పార్లమెంటు పై పొగదాడి చేశారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు నిందితులు పార్లమెంట్‌లోకి విజిటర్లుగా ప్రవేశించి, హౌజులో పొగ డబ్బాలను పేల్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసుల వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ హాలులో పోగ డబ్బాలను వదిలారు. దీంతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కాలంలో భారత్‌ని బెదిరిస్తూ పలు వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల భారత పార్లమెంట్ పునాదులు కదిలిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఆ వీడియోలో హెచ్చరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్‌పై లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన అప్జల్ గురు ఫోటోను…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూసుకెళ్లి రంగు పొగను విసిరిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ దుండగులు వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు.
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మళ్లీ భారత్‌పై విషం చిమ్మారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనను చంపడానికి కుట్ర విఫలమైన తర్వాత, డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని ఇందులో చెప్పాడు.