పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు పతకాల పంట పండుతుంది. 4వ తేదీన (బుధవారం) భారత పారాథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ సంచలనం సృష్టించాడు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46)లో సచిన్ రజత పతకం సాధించాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే.. బ్యాడ్మింటన్‌లో దేశానికి ఇది మూడో పతకం. మురుగేశన్, మనీషా కంటే ముందు నితీష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో స్వర్ణ…