మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి నిరూపితమయ్యాయి. గుంట భూమి కోసం కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు. రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు. మానవ సంబంధాలను మంటగలిపేశారు. అతని స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులే కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందాలో చోటుచేసుకుంది. మృతుడు తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అక్కడికి చేరుకున్నారని సమాచారం. వారు నిర్మాణానికి అభ్యంతరం చెప్పినప్పుడు,…