Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ "విఐపి ట్రీట్‌మెంట్" ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.