Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు.