పారా మిలటరీ జవాన్లతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి కావ్యతో కలిసి పారామిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశసేవలో పనిచేస్తున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబసభ్యులకు దీపావళి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.