యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ప్రదీప్ ఇంకా బయటపడినట్టు కనిపించడం లేదు. మొదటి సారిగా ప్రదీప్ తన తండ్రి మరణానంతరం స్పందించారు. ‘జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా హుందాగా చిరునవ్వు ఎలా ఎదుర్కోవాలో నేర్పించినందుకు థాంక్యూ నాన్న.. ఇక నుంచి నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను, మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మనం మళ్లీ కలుసుకునే వరకు…