ఏపీలో ఇవాళ 69 పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా.. కేసుల కారణంగా కొన్ని చోట్ల.. అభ్యర్థుల మరణంతో మరికొన్ని చోట్ల.. గొడవలు జరిగి ఇంకొన్ని చోట్ల… ఎన్నికలు నిలిచిపోయాయి. వీటిన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ 69 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి… పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల,…