Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే రెండవ దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.