కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారి మార్పుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అభ్యంతరాలేమైనా ఉంటే ఎస్ఈసీని ఆశ్రయించాలని పిటిషనరుకు హైకోర్టు సూచించింది. ఆ మేరకు వినతి పత్రాన్ని ఎస్ఈసీకి ఇవ్వాలని పిటిషనరుకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సదురు పిటిషనుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు తెలిపింది. రిటర్నింగ్ అధికారి ఉండగా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించారని కమిషన్ను ప్రశ్నించిన హై కోర్టు… ప్రత్యేక అధికారి రిటర్నింగ్ అధికారికి సహాయపడేందుకు మాత్రమే నియమించామని చెప్పారు…