Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు.. ట్రాక్టర్ల లోడుతో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్పందించిన అక్కడి ప్రజలు, పోలీసులు.. తీవ్రగాయాలపాలైన ఇద్దరిని.. సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అధిక వేగమే కారణమై ఉండొచ్చని…