నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు కలిపి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 13 నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నేడు(గురువారం) 6 నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.…