Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.