పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రపంచం యుద్ధం, శాంతిని ఎంచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
Israel: ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తీవ్ర యుద్ధం చెలరేగింది. గాజా స్ట్రిప్‌ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. పటిష్ట ఇంటెలిజెన్స్ నిఘా, గూఢచార సంస్థలు ఉన్న ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఊహించలేకపోయింది. ఏకంగా 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 40 మంది మరణించారు. 700 మందికి పైగా గాయాలయ్యాయి.