అన్నాడీఎంకేలో జయలలిత మరణం తర్వాత వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు బలమైన నేతలుగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారే నంబర్‌వన్ అవ్వాలన్న కాంక్ష వీరి మధ్య దూరాన్ని పెంచింది. తాజాగా అదును చూసి పన్నీర్ సెల్వంను పళనిస్వామి దెబ్బకొట్టారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయ్యారు. మరోవైపు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి…
అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరింది. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ లీడర్‌షిప్ ప్రతిపాదనపై ఈరోజు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముందే చెన్నైలో పన్నీర్, పళని వర్గాల నేతలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. అంతేకాకుండా చెన్నైలోని అన్నా డీఎంకే ఆఫీసులోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టారు. జయలలిత కట్టించిన ఈ ఆఫీస్‌లో ఈరోజు పన్నీర్ సెల్వం, పళనిస్వామి…