రామాయణం ఒక పవిత్రమైన హిందూ గ్రంథం. వాల్మీకి రామాయణం భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఇతిహాసం. మనిషి ఎలా జీవించాలో రామాయణంద్వారా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువల్ని భోధించడమే కాదు.. వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. తాజాగా ఈ రామాయణ గాథను పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శించారు.
1947లో భారతదేశం, పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భారత్ నుంచి పాక్‌కు వెళ్లారు. పాక్ నుంచి కూడా లక్షలాది మంది భారత్ కు వచ్చాయి. అయితే కొంత మంది మాత్రం తమ ఇళ్లను, ఊరిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం మన దేశంలో నివసిస్తున్న ముస్లింలు అందరూ భారత్‌ను విడిచి పెట్టి వెళ్లలేక ఇక్కడే ఉన్నారు. పాకిస్థాన్‌లోని హిందులు మాత్రం దాదాపు అందరూ తిరిగి వచ్చారు. కానీ.. ఓ కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది.