Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.