India Warns Pakistan: దాయాది దేశానికి భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ యుద్ధంలో ఇండియా తాలిబన్లకు బాసటగా నిలిచింది. తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇండియా.. ఆఫ్ఘన్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తుందని, ఇప్పటి వరకు వాటిపై సమర్థంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన వెల్లడించారు. దాయాది దేశం తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం…
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.