Viral Video: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత, మన దేశ భూభాగాల్లోని పౌరులు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, విమానాలు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా వీటిని అడ్డుకున్నాయి.