ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది.
పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (71) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు.