భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోట్ పట్టుబడింది. పడవ నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే 40 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్తానీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్ ప్రవేశించడంతో స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన బోట్‌లో ఉన్న 10 మందిని గుజరాత్ తీరరక్షక దళం అదుపులోకి తీసుకుంది. అయితే పట్టుబడ్డిని వారిని విచారణ నిమిత్తం పోర్ బందర్‌కు గుజరాత్ తీరరక్షక దళం తరలించింది. గుజరాత్‌లో గత నెల 20న కూడా భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్‌ను గుజరాత్…