WI vs Pak: వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్లను ఈరోజు (జులై 25) ఆ దేశ బోర్డు ప్రకటించింది. టీ20 జట్టుకు సల్మాన్ అఘా, వన్డే జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది టీ20ల్లోకి మరోసారి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురైంది.