LoC: భారత్‌ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.