అయితే, పేజర్‌లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్‌ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.
లెబనాన్‌లో పేజర్ పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తిగా 49 ఏళ్ల విదేశీ మహిళ పేరు వినిపిస్తోంది. ఈ మహిళ హంగేరీకి చెందినది. ఆమె పేరు క్రిస్టియానా బార్సోనీ. క్రిస్టియానా బుడాపెస్ట్‌లోని BAC కన్సల్టింగ్‌కు CEOగా వ్యవహరిస్తోంది.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు.
Israel: హిజ్బుల్లా మిలిటెంట్లను ఇజ్రాయిల్ చావు దెబ్బ తీసింది. ఎక్కడ మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తే ఇజ్రాయిల్ కనిపెట్టేస్తోందనే భయంతో అవుట్ డేటెడ్ కమ్యూనికేషన్ పరికరం ‘‘పేజర్’’లను హిజ్బుల్లా మిలిటెంట్లు వాడుతున్నారు.