ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.…
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం వార్డుబాయ్ ఘోరానికి ఒడిగట్టాడు. అతడి బాలుడి ప్రాణం తీశాడు వార్డ్ బాయ్. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలన్నారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అక్కడే మరో రోగి చికిత్స అందుకుంటున్నాడు.…