Foreign Players Captaincy Luck To Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళితే.. అన్నిసార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండడం విశేషం. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు కప్ కూడా అందించాడు. 2008లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్.. 2009లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి టైటిల్ సాదించింది.…