జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ‘దక్షిణ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు… జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల ‘రాధే’లో ‘సిటీమార్…’ పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం తమిళ్ టాప్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ చిత్రానికి నృత్య దర్శకత్వం చేస్తున్నారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పుడీ కొరియోగ్రాఫర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా తొలి సినిమా ప్రారంభించిన ఆయన, రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘మంత్ర’తో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ జోష్ తీసుకొచ్చిన దర్శకుడు ఓషో తులసీరామ్. ఆ సినిమా విజయం తర్వాత ఛార్మితో మరో ప్రామిసింగ్ సినిమా ‘మంగళ’ తీశారు. హీరోగా తన రెండో సినిమాను ఓషో తులసీరామ్ దర్శకత్వంలో జానీ మాస్టర్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ కథానాయకుడిగా ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దక్షిణ’. జులై 2 జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ “జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అలాగే, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!