పాపులర్ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆస్కార్ 2022 సంఘటన తర్వాత ఆయనకు అన్నీ చేదు ఘటనలే ఎదురవుతున్నాయి. క్రిస్ రాక్‌ను ఆస్కార్ 2022 అవార్డుల వేదికపై కొట్టి సంచలనం సృష్టించిన విల్ స్మిత్ ఆ తరువాత ఆయనకు, ఆయన కుటుంబానికి బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ వివాదాల మధ్య విల్ స్మిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also…