Rajamouli:'ఆస్కార్ అవార్డ్స్' అన్న పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మనసుల్లో ఆనందం పొంగిపొరలుతూ ఉంటుంది. 'ఆస్కార్ అవార్డులు' సాధించిన చిత్రాలనే కాదు, అకాడమీ నామినేషన్లు పొందిన సినిమాలనూ సినీజనం ఎంతగానో అభిమానిస్తారు, గౌరవిస్తారు. సదరు చిత్రాలను అంతకు ముందే థియేటర్లలో ఓ సారి చూసేసినా, మళ్ళీ చూడాలనీ తపిస్తారు. అంతటి క్రేజ్ బహుశా ప్రపంచంలో ఏ సినిమా అవార్డులకూ లేదనే చెప్పాలి.