RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం గత సంవత్సరం అత్యధిక వసూళ్ళు చూసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకుంటూ సాగుతోంది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజామున ‘ఆస్కార్ నామినేషన్స్’ ప్రకటన వెలువడుతుంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ ఏ యే కేటగిరీల్లో నామినేషన్స్ సంపాదిస్తుందో అన్న ఆసక్తి తేదీ దగ్గర పడే…