ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. చింతపల్లి ఏఎస్పీగా 2021 బ్యాచ్‌కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే.. నంద్యాల ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి అల్ఫోన్‌ను నియమించారు.
హైదరాబాద్: స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని… ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు అనే బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై బుధవారం విచారించిన సిటీ సివిల్…