ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామివేషన్ వేయనున్నారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును విపక్ష పార్టీలు ఎంపిక చేశాయి. ఆమెను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.