YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. Read…
బిహార్ పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఈ షాకింగ్ ఘటన నవాదా జిల్లాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని…
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రితో ఓ అరుదైన సర్జరీ జరిగింది. కాలిన గాయాలతో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి హోమో గ్రాఫ్ట్ సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చనిపోయినవారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన తరువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు. కాలిన గాయాలపై స్కిన్‌తో సర్జరీ చేస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్దరి నుంచి చర్మాన్ని సేకరించినట్టు వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో చేసిన…
ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు.…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4…
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులో ఉన్నది. అవయావాల మార్పిడి కూడా వేగంగా జరుగుతున్నది. అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత వేధిస్తున్నది. మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్‌కు చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం…