Operation Sarvashakti: జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. లోయలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇటీవల పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. పిర్ పంజాల్ పర్వతాలను, అక్కడి అడవుల్లో దాక్కుంటూ భద్రతా సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని గుహలు, కొండలు, అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడంతో వారిని ఏరేసేందుకు చేస్తున్న ఆపరేషన్లు కష్టంగా మారాయి. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో అధికారులతో సహా జవాన్లు 20 మంది…