ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్ బిగ్ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్. విజయ్, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ పై యం. రాజశేఖర్ రెడ్డి, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న…
‘బన్నీ, భగీరథ, ఢీ’ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘నాకౌట్’. దీని ద్వారా మహీధర్ హీరోగా, ఉదయ్ కిరణ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయ్యాయి. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరో, హీరోయిన్ల పై తీసిన తొలి సన్ని వేశానికి సాయి రాజేశ్ క్లాప్…