టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ‘నారప్ప’ చిత్రాన్ని జులై 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప..…