ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి భవనిపురం కాలనీ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు ముఠా పాల్పడుతున్నారనే పక్క సమాచారంతో చందానగర్ పోలీసులు మరియు మాదాపూర్ SOT పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.